మన దగ్గర నగదు ఉంటే బంగారం పై పెట్టుబడి పెట్టడం మంచిది, దీని వల్ల మనకు నగదు అవసరం అయిన సమయంలో ఈ బంగారం కుదవ పెట్టవచ్చు లేదా అమ్మి నగదు పొందవచ్చు, అయితే ఇప్పుడు బంగారు కాయిన్స్ కొనాలి అంటే బంగారు షాపులకే వెళ్లాల్సిన పనిలేదు, నేరుగా బ్యాంకులు కూడా వీటిని అమ్ముతున్నాయి, అయితే ఇవి కాస్త ప్రీమియం ఉంటాయి, బయటతో పోలిస్తే బ్యాంకుల్లో కాయిన్స్ కాస్త ధర ఎక్కువ ఉంటుంది..వీటి వల్ల కస్టమర్లకు బెనిఫిట్ ఏమిటి అనేది చూద్దాం
1..బ్యాంకుతో మీ కేవైసీ పూర్తయినట్లయితే మీరు నాణాలు గ్రాము నుంచి 2 గ్రాములు నాలుగు గ్రాములు 10 గ్రాముల కాయిన్స్
కొనుగోలు చేయవచ్చు.
2..నెట్ బ్యాంకింగ్ లో కూడా మీరు కాయిన్ కొనవచ్చు
3. 50 వేల కంటే ఎక్కువ ధరకు మీరు బంగారం కొంటే పాన్ కార్డ్ ఇవ్వాల్సిందే
4. మీరు బ్యాంకులు గోల్డ్ కాయిన్స్ అమ్ముతాయి, మళ్లీ కస్టమర్ల నుంచి కొనుగోలు చేయవు
5. ధర పెరిగినా తగ్గినా మీరు బయట బంగారు దుకాణాల్లో అమ్ముకోవాల్సిందే
6. బ్యాంకుల్లో కొనడం వల్ల బంగారు తరుగుదల ఛార్జీలు, తయారీ ఖర్చులు తగ్గించుకోవచ్చు.
7. ఈ కాయిన్స్ ప్రభుత్వం ఆమోదించిన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
8. మీరు ఏ షాపులో కొన్నా ఏ బ్యాంకులో కొన్నా వెయిట్ చూసి దాని బిల్లు తీసుకోవాలి.