Flash- బెంగాల్‌ సీఎం కార్యాలయంలో అగ్ని ప్రమాదం

0
80

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సచివాలయం (నబన్నా)లోని 14వ అంతస్తులో ఉన్న సీఎం కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌లో పని చేస్తున్న కార్మికులు కార్యాలయంలో నుంచి పొగలు రావడం గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్‌ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.

అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దుర్గాపూజ సందర్భంగా సెలవు కారణంగా సచివాలయాన్ని మూసివేశారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు, కార్యాలయంలో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదు.