మన దేశంలో జనాభా ఎక్కువగానే ఉన్నారు చైనాలో కూడా జనాభా భారీగానే పెరుగుతోంది, అయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పలు దేశాల్లో అయితే జనాభా చాలా తక్కువమంది ఉంటున్నారు, దీని వల్ల వారి దేశంలో యువత స్ట్రెంత్ అనేది తగ్గుతోంది అనే ఆందోళన ఉంటోంది.
అందుకే వివాహం చేసుకున్న వారికి అలాగే పిల్లల్ని కనాలి అనుకున్న వారికి కొంత ప్రొత్సాహాలు ఇస్తున్నారు అక్కడ ప్రభుత్వ అధికారులు.. ఇది ఎక్కడ అంటే జపాన్ లో. ఇటీవల జపాన్ దేశంలో జనాభా తగ్గిపోతోంది. 2018నాటికి జపాన్ జనాభా కేవలం 12.65 కోట్లు మాత్రమే. ఇది వారి వర్క్ పై ప్రభావం చూపిస్తోంది.
అందుకే దేశంలోని యువత పెళ్లిళ్లపై ఫోకస్ పెట్టింది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి అని చెబుతోంది, ఇలా చెబితే వినరు అని ఏకంగా ఆర్దికంగా సాయం చేస్తోంది.పెళ్లిళ్లు చేసుకుంటే దేశంలో జనాభా పెరుగుతుందని భావించిన జపాన్ ప్రభుత్వం.. పెళ్లి చేసుకున్న జంటకు జపాన్ కరెన్సీ 600000 అంటే మన కరెన్సీలో నాలుగున్నర లక్షలు అందివ్వనుంది.
ప్రపంచంలో అత్యధికంగా వయో వృద్ధుల సంఖ్య కూడా ఆ దేశంలోనే ఉంది. అయితే ఆర్థిక సమస్యల వల్ల అక్కడి యువత పెళ్లికి నో చెబుతోంది. నిత్యం పనిమీదే ఫోకస్ చేస్తున్నారు అందుకే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది, అయితే ఈ ప్రొత్సాహం వల్ల కొందరు పెళ్లికి సిద్దం అవుతున్నారు. ఇక్కడ పెళ్లి చేసుకునేవారి వయస్సు 40 సంవత్సరాలు మించకూడదని నిబంధన పెట్టింది. 2040 కల్లా జపాన్ జనాభాలో ఇప్పుడున్న వృద్ధుల సంఖ్య 35 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇక్కడ జననాల కంటే మరణాలు ఎక్కువ ఉన్నాయి.