ఫ్లాష్ న్యూస్ – అక్కడ రెండు వారాలు లాక్ డౌన్ కీలక ప్రకటన

ఫ్లాష్ న్యూస్ - అక్కడ రెండు వారాలు లాక్ డౌన్ కీలక ప్రకటన

0
80

కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి..దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు, నగరాలు పట్టణాలు పల్లెలు ఇలా చాలా ప్రాంతాల్లో కేసులు నమోదు అవుతున్నాయి..

ఢిల్లీ వంటి రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించగా, మరికొన్ని రాష్ట్రాలు నైట్కర్ఫ్యూ సహా లాక్డౌన్ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

ఇక శని ఆదివారాలు పూర్తిగా లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు.

 

అయితే తాజాగా కర్నాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. నిన్న కర్ణాటకలో అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. ఇక బెంగళూర్ మహానగరంలో కరోనా కేసులు దారుణంగా నమోదు అవుతున్నాయి దీంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్.

 

ఈ నెల 27వ తేదీ నుంచి 14 రోజులపాటు కఠిన లాక్డౌన్ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు అనుమతి ఉంటుంది. పది తర్వాత ఏ షాపు ఉండదు అన్నీ క్లోజ్ చేయాల్సిందే.