సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు , తెలంగాణ నుంచి ఏపీకి మిడతల దండు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు, ఏకంగా ఇప్పుడు ఏపీకి మిడతల దండు వచ్చేసింది అని వార్తలు వీడియోలు వైరల్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది చూస్తే.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం దగ్గర ఉన్న దానప్ప రోడ్డులో రెండు జిల్లేడు చెట్లపై మిడతలు ఉన్నాయి. ఇవి మహరాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వస్తున్న మిడతల దండు అని అక్కడి ప్రజలు రైతులు భయపడుతున్నారు. కాని ఇది వాస్తవం కాదు అని వ్యవసాయశాఖ అధికారులు సైంటిస్టులు తెలియచేశారు.
మిడతల దండు జిల్లాలోకి ప్రవేశించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎడారి మిడతల దండు ఉన్నట్లు తెలుస్తోందన్నారు, అక్కడ నుంచి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని అక్కడ నుంచి గోదావరి జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంది అని అంటున్నారు అధికారులు. రైతులు వీటిని తరిమేందుకు సిద్దంగా ఉండాలి అని అంటున్నారు.