ఫ్లాష్ న్యూస్ — భార‌త్ లో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు గ్రీన్ సిగ్న‌ల్

ఫ్లాష్ న్యూస్ --- భార‌త్ లో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు గ్రీన్ సిగ్న‌ల్

0
187

ప్ర‌పంచం అంతా క‌రోనా వైర‌స్ గురించే చ‌ర్చ ..అయితే దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు, అంద‌రి చూపు అన్నీ దేశాల ఆతృత ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా కోవిడ్ -19 వ్యాక్సిన్ పైనే ఉంది, అయితే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ లో సూప‌ర్ గా స‌క్సెస్ అవుతున్న వేళ ఓ వాలంటీర్ కు అనారోగ్యం రావ‌డంతో.

ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా చోట్ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిలిపివేశారు, మ‌ళ్లీ గ‌త శ‌నివారం నుంచి స్టార్ట్ చేశారు, అయితే భార‌త్ లో కూడా కొన్ని రోజులు ట్ర‌య‌ల్స్ నిలిపివేశారు, కాని తాజాగా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా టీకా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు అనుమతి ఇచ్చింది.

ఆగస్టు 2, 2020 నాటి క్లినికల్ ట్రయల్ ను తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. స్క్రీనింగ్ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా సమాచారం ఇవ్వాలని తెలిపారు, మందు విష‌యంలో ఎలాంటి ప్ర‌మాదం జ‌రిగినా దానికి సంబంధించిన వివ‌రాలు మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇవ్వాల‌ని తెలిపారు, దీంతో మ‌ళ్లీ ఇండియాలో ట్ర‌య‌ల్స్ ప్రారంభం కానున్నాయి.