ఫ్లాష్ న్యూస్ – చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం

ఫ్లాష్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం

0
99

చిలుకూరు బాలాజీ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది, కోరిన కోరికలు తీర్చే బాలాజీగా తెలంగాణ వెంకన్నగా కొలుస్తారు, అయితే స్వామి కోరిన కోరికలు నెరవేర్చడంతో 108 ప్రదిక్షణాలు కూడా చేస్తారు.. అయితే నేడు ఆలయంలో అద్భుతం జరిగింది.

చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం ఉదయం అద్భుతం జరిగింది. గుడికి అర్చక స్వామి సురేష్ మహరాజ్ తెల్లవారుజామున వచ్చారు. స్వామివారి సన్నిధిలో కూర్మ మూర్తి తాబేలు ఉండటాన్ని గమనించి వెంటనే ఆ విషయాన్ని ప్రధాన అర్చకులు రంగరాజన్కు తెలిపారు.

ఆయన కూడా ఇలా జరగడం చూసి ఆశ్చర్యపోయారు, అసలు దేవాలయంలోకి ఇలా తాబేలు వచ్చే ఆస్కారం దారి లేదు అని అంటున్నారు..అయినా ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని అన్నారు.
ఇలా తాబేలు ఆలయ ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తోందని రంగరాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మనకు త్వరలోనే కరోనా నుంచి విముక్తి వస్తుంది అని అన్నారు.