మొత్తం ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. ఆగస్ట్ 12న రష్యా ఈ వైరస్ కు సంబంధించి వ్యాక్సిన్ విడుదల చేస్తాము అన్నారు, అలాగే నేడు దీనిని రిజిస్టర్ చేసి వ్యాక్సిన్ విడుదల చేశారు… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాక్సిన్ విడుదల చేశాము అని ప్రకటించారు. టీకాను పరీక్షించిన వారిలో తన కుమార్తె కూడా ఉన్నట్లు పుతిన్ తెలిపారు.
ఇక మొదటగా దీనిని తమ దేశంలో అత్యవసరం అయిన వారికి అందిస్తాము అన్నారు..తన కుమార్తె కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంది అని పుతిన్ అన్నారు.. ఆమె ఆరోగ్యంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.
రష్యా రక్షణశాఖ, గమలేయ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఈ వ్యాక్సిన్ ని.
రేపటి నుంచి ఈ టీకాని ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, వైరస్ ప్రమాదం అధికంగా పొంచి ఉన్న వారికి అందివ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.. వాక్సిన్ అభివృద్ధి కోసం కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.. పంపిణీలో ఎలాంటి సమస్య లేకుండా ముందే ప్లాన్ చేసింది రష్యా, మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయి.