FLASH NEWS – దేశంలో కరోనా రికార్డు ఒక్క రోజే ఎన్నికేసులంటే

FLASH NEWS - దేశంలో కరోనా రికార్డు ఒక్క రోజే ఎన్నికేసులంటే

0
91

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి… దాదాపు లక్ష కేసులు

భారత్ లో దాటేస్తున్నాయి.. మన దేశంలో కరోనా ఎంటర్ అయిన వేళ లాక్ డౌన్ సమయంలో వచ్చిన కేసులు కంటే ఇప్పుడు సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. ఏకంగా మొన్న లక్షదాటిన కేసులు ఈసారి ఏకంగా

గడిచిన 24గంటల్లో 1,15,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

ఈ నెంబర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు, కొన్ని స్టేట్స్ లో చాలా దారుణమైన పరిస్దితి కనిపిస్తోంది.. భారీగా కేసులు నమోదు అవుతున్నాయి….ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. అయితే కేసులు లక్ష దాటితే రికవరీ అయి ఇంటికి వచ్చిన వారి సంఖ్య చూస్తే 59 వేలు ఉంది.. అంటే ఇంకా కొత్త కేసులు డబుల్ అయ్యాయి.

 

 

దేశంలో 8,43,473 యాక్టివ్ కేసులున్నాయి.. ఓ పక్క వాక్సినేషన్ కూడా జరుగుతోంది… ఇప్పటి వరకు 8,70,77,474 డోసులు వేసినట్లు తెలిపారు.. ఇక కోవిడ్ టెస్టులు కూడా దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. 25 కోట్ల టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.