మన దేశంలో మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది, ఈ సమయంలో ప్రజా రవాణా పూర్తిగా బంద్ చేశారు విమానాలు రైళ్లు బస్సులు ఆటోలు వ్యానులు ఇలా ప్రజలను తీసుకువెళ్లే అన్నీ రవాణాలు బంద్ అయ్యాయి, అంతేకాదు వ్యక్తిగత వాహనాలను రోడ్ల మీద తిరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
మరి మే 3 తర్వాతే ప్రజా రవాణా పై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
అయితే ప్రత్యేకావసరాల దృష్ట్యా రెండు స్పెషల్ రైళ్లను నడపాలని కేంద్రం నిర్ణయించింది.
ఉత్తర, ఈశాన్య ప్రాంతాలకు సైనికులను చేర్చేందుకుగాను ఈ రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. కేవలం సైనికులకి మాత్రమే, జనాలకి మాత్రం కాదు ఇది గుర్తు ఉంచుకోండి.
ఈనెల 17, 18 తేదీల్లోఈ ట్రైన్లు ప్రయాణం ప్రారంభించనున్నాయి. బెంగళూరు-బెల్గాం-సికింద్రాబాద్-అంబాల మీదుగా ప్రయాణించి ఈనెల 20న జమ్మూకు చేరుతుంది ఒక ట్రైన్… అలాగే మరో ట్రైన్ 18న బెంగళూరు-బెల్గాం-సికింద్రాబాద్-గోపాల్‌పూర్-హౌరా-న్యూజల్పాయ్‌గురి మీదుగా ఈనెల 20న గువాహటికి చేరుతుంది. ఈ రైల్ ని పూర్తిగా శానిటైజ్ చేశారు, బోగికి నలబై మంది మాత్రమే సైనికులు ఉంటారు ఫుడ్ అన్నీ రైల్వే సమకూరుస్తుంది. ప్రయాణికులు ఎక్కరు మిగిలిన స్టేషన్లో ఆపరు.