యూరప్ లోని ఇటలీ ఈ ప్రాణాంతకర వైరస్ వల్ల చాలా నష్టపోతోంది, అసలు ఇటలీలో దారుణమైన పరిస్దితి ఉంది, ఒకటి కాదు ఇద్దరు కాదు ఏకంగా రోజుకి 600 నుంచి 700 మరణాలు నమోదు అవుతున్నాయి, 70 నుంచి 80 ఏళ్ల వృద్దులు ఆస్పత్రికి వస్తే వారికి ట్రీట్మెంట్ అందించడం లేదు, వారికి చికిత్స చేసినా బతికే ఛాన్స్ తక్కువ అని కొందరు వదిలేస్తున్నారట.
అందుకే అసలు వారు బయటకు రావడం లేదు… మిల్క్ కూరగాయలకు కూడా ఇటలీలో జనం బయటకు రావడం లేదు, ఇలా దాదాపు ఇటలీలో6077 మంది మరణించారు, ఇక రోడ్లపైకి వస్తే వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, కాలుస్తాం అని బెదిరిస్తున్నారు.
ఇక దాదాపు 5 శాతం కూడా రోడ్లపైకి రావడం లేదు, ఎవరిని వదిలిపెట్టమని రాజకీయ నాయకులుఉద్యోగులు ఇలా ఎవరూ బయటకు రావద్దు అని చెప్పారు, దీంతో ఇటలీ రోడ్లు నిర్మాణుష్యం అయ్యాయి, పెట్రోల్ కూడా పంపులు మూసేశారు, ఏ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా కేవలం ఫోన్ చేయాల్సిందే, వాటర్ పవర్ సప్లై కొన్ని ఏరియాల్లో ఫుడ్ సప్లయ్ చేస్తున్నారు …ఇంటికి వెళ్లి వారే ఇస్తున్నారు, పిల్లలకు ఫుడ్ అందిస్తున్నారు, కేవలం నెట్ – ఫోన్ నెట్ వర్క్ పని చేస్తున్నాయి. అయినా ఆంక్షలు ఉల్లంఘన చేస్తే నాలుగు లక్షల జరిమానా అని ప్రకటించారు.