ఈ కరోనా తో దేశ వ్యాప్తంగా అందరూ బయటకు రావాలంటేనే భయపడుతున్నారు, దేశ వ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయి, మరీ ముఖ్యంగా మహరాష్ట్రలో దారుణాతి దారుణంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా జూన్ నెలాఖరు వరకూ లాక్ డౌన్ అమలులో ఉంది.
ఈ సమయంలో కేసులు సంఖ్య తగ్గక పోవడంతో మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తారు అనే తెలుస్తోంది.
ఈ సమయంలో ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జులై 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఝార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు.
ఇక ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి వాహనాలు కూడా అనుమతించరు, అంతేకాదు ఇప్పటి వరకూ ఎంత కఠినంగా లాక్ డౌన్ ఉందో అలాగే అమలు చేస్తారు.వినోదం, విద్యా, మతపరమైన కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు హేమంత్ ప్రకటించారు. హొటల్స్ లాడ్జీలు, ధర్మశాలలు రెస్టారెంట్లు కూడా క్లోజ్ చేస్తారు.రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రోడ్లపై రాకపోకలను బంద్ చేశారు. వేరే స్టేట్స్ నుంచి ఎవరిని అలౌ చేయరు.