ఇటీవల పడవ ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి, తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంబల్ నదిలో 50మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది, ఇందులో పది మంది వరకూ ప్రయాణికులు జాడ లేదు, గల్లంతు అయ్యారని అక్కడ సిబ్బంది తెలిపారు.
కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్ నదిని దాటుతున్న సమయంలో పడవ బోల్తా పడింది. పడవలో 14 బైకులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే ఇక్కడ వారు
పోలీసులకు సమాచారం ఇచ్చారు, అక్కడ రెస్క్యూ బృందాలు వారికోసం గాలింపు చేపట్టాయి.
అయితే ఇక్కడ పరిమితి దాటి బైకులు ప్రయాణికులు ఎక్కడం వల్ల పడవ ప్రమాదం జరిగింది అని ప్రాధమికంగా తెలుస్తోంది.40 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు..ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
వారి కోసం గాలిస్తున్నారు..బాధితులంతా బుండి జిల్లాలోని కమలేశ్వర మహాదేవ్ దేవాలయానికి పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.