ఫ్లాష్ న్యూస్– రేపు దీపాలువెలిగించే ముందు శానిటైజ‌ర్లు వాడ‌ద్దు కార‌ణం ఇదే

ఫ్లాష్ న్యూస్-- రేపు దీపాలువెలిగించే ముందు శానిటైజ‌ర్లు వాడ‌ద్దు కార‌ణం ఇదే

0
102

మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ….రేపు అంటే ఏప్రిల్ 5న రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించాలి అని పిలుపునిచ్చారు.. రాత్రి 9 గంట‌ల‌కు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించ‌నున్నారు. అయితే దీపాలు వెలిగించే ముందు ఎవ‌రూ కూడా శానిటైజ‌ర్ వాడ‌కండి. ఇది డేంజ‌ర్ అంటున్నారు కొంద‌రు వైద్యులు.

దీపాలు వెలిగించే ముందు చేతులు శుభ్రం చేసుకునేందుకు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లకు బదులు సబ్బును ఉపయోగించాలని చెబుతున్నారు. అంతేకాదు ఈ మేరకు ఇవాళ భారత ఆర్మీ ట్విటర్ ద్వారా ప్రజలకు కీలక సూచనలు చేసింది. ఏప్రిల్ 5న కొవ్వొత్తులు, దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉందాం. దీపాలు వెలిగించే ముందు చేతులు కడుక్కునేందుకు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల బదులు సబ్బును ఉపయోగించండి అని కోరింది.

అయితే ఇలాంటి శానిటైజ‌ర్ల వ‌ల్ల దీపాల నుంచి మ‌న చేతికి మంట‌లు అంటుకుంటాయి అని చెబుతున్నారు, అందుకే ఈ స‌మ‌యంలో స‌బ్బుతో చేతులు క‌డుక్కోవాలి అని చెబుతున్నారు, ఈ విష‌యం మర్చిపోకండి ఆరోజు దీపాల స‌మ‌యంలో నో శానిటైజ‌ర్స్ ఓన్లీ సోప్స్ అనేది తెలుసుకోండి.