ఫ్లాష్ న్యూస్ — తీపిక‌బురు వ్యాక్సిన్ రేసులో మ‌రో దేశం కీల‌క ప్ర‌క‌ట‌న

ఫ్లాష్ న్యూస్ -- తీపిక‌బురు వ్యాక్సిన్ రేసులో మ‌రో దేశం కీల‌క ప్ర‌క‌ట‌న

0
90

ఈ క‌రోనాకి మందు ఎవ‌రు క‌నిపెడ‌తారో అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది, ముఖ్యంగా క‌రోనా మ‌హ‌మ్మారి దారుణంగా విజృంభిస్తోంది, ఈ స‌మ‌యంలో కేసులు దారుణంగా పెరుగుతున్నాయి, అయితే ర‌ష్యా నుంచి వ్యాక్సిన్ ముందు వ‌స్తుంది అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు, అమెరికా నుంచి కూడా సానుకూల ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి.

ఈ స‌మ‌యంలో భార‌త్ లో కూడా ప‌లు కంపెనీలు ట్ర‌య‌ల్స్ లో ఉన్నాయి, ఈ స‌మ‌యంలో వ్యాక్సిన్ ఎవ‌రు త‌యారు చేసినా ప్ర‌పంచానికి ఇది గుడ్ న్యూస్ అవుతుంది, తాజాగా మ‌రో దేశం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది వ్యాక్సిన్ పై.

తమ వద్ద అద్భుతమైన వ్యాక్సిన్ సిద్ధంగా ఉందంటూ కీలక ప్రకటన చేసింది ఇజ్రాయెల్ . ఇప్పుడు ప్ర‌పంచం చూపు మ‌ళ్లీ ఈ దేశం వైపు వెళ్లింది.ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్ లో దీని ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి, మాన‌వుల‌పై ట్ర‌య‌ల్స్ చేస్తున్నాము అని తెలిపారు, మ‌రో ప‌క్క భారీ ఎత్తున ఈ వ్యాక్సిన్ త‌యారీకి సిద్దం అవుతున్నారు.