సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో దాదాపు 20 ప్యాసింజర్ రైళ్లు ఎక్స్ ప్రెస్ రైళ్లు అవుతున్నాయి, తాజాగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది, మరి ఈ రైళ్లు ఇప్పటి వరకూ ఆగుతున్న అన్నీ స్టేషన్లలో ఆగవు, హాల్ట్ సంఖ్య తగ్గుతుంది, అంతేకాదు రైల్వే ప్రయాణం మరింత వేగంగా ఉంటుంది, ప్రయాణికులకి రిజర్వేషన్ సౌకర్యంకూడా ఉంటుంది.
మరి మన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఇరవై ప్యాసింజర్ రైళ్లు మార్పులు జరుగుతున్నాయి, మరి ఆ రైళ్ల వివరాలు చూద్దాం
మచిలీపట్నం – విశాఖపట్నం
తిరుపతి – గుంటూరు
నర్శాపురం – విశాఖపట్నం
కాకినాడ పోర్ట్ – విజయవాడ
గుంటూరు – నరసాపురం
రేపల్లె – సికింద్రాబాద్
కాచిగూడ – గుంటూరు
గూడూరు – విజయవాడ
డోన్ – గుంటూరు
గుంటూరు – నరసాపురం
మరి ఈ ప్యాసింజర్ రైళ్లు ఎప్పటి నుంచి ఎక్స్ ప్రెస్ లుగా మారుతాయి అనేది సమయం తేదీ ఇవ్వలేదు, అయితే ఇప్పటి వరకూ ఉన్న టికెట్ రేటు కంటే ధర కూడా పెరిగే అవకాశం ఉంది.