ఫ్లాష్ న్యూస్, మూడు నెలలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

ఫ్లాష్ న్యూస్, మూడు నెలలు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు

0
92

కేంద్రం ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది , నెల‌కి 500 రూపాయ‌ల చొప్పున పేద‌ల‌కు వారి ఖాతాలో న‌గ‌దు జ‌మ చేస్తాము అని చెప్పిన కేంద్రం ..తాజాగా గ్యాస్ కూడా మూడు నెల‌లు ఉచితంగా ఇస్తామ‌ని తెలిపింది, అయితే అంద‌రికి కాదు పీఎం ఉజ్వ‌ల స్కీమ్ లో గ్యాస్ పొందిన వారికి ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనుంది కేంద్రం. ఏప్రిల్ నుంచి జూన్ 3 వరకు మూడు నెలల పాటు నెలకు ఒకటి చొప్పున గ్యాస్ సిలిండర్ ఇస్తారు. ఈ పథకం కింద 8 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్ లబ్దిదారులు ఉన్నారు. అయితే మొద‌టి గ్యాస్ సిలిండ‌ర్ తీసుకుంటేనే రెండు మూడు కూడా వారికి వ‌స్తాయి.

ఇక ఈ అమౌంట్ నేరుగా బ్యాంకు ఖాతాలో జ‌మ అవుతాయి, ఆ త‌ర్వాత గ్యాస్ మీరు బుక్ చేసుకోవాలి, గ్యాస్ కొర‌త ఎక్క‌డా లేద‌ని తాజాగా ఈ విష‌యాన్ని తెలిపింది కేంద్రం, ఎవ‌రికి అయినా అత్య‌వ‌స‌రం అనుకుంటే బుక్ చేసుకోవాలి అని చెప్పారు, కేవ‌లం 15 రోజుల గ్యాప్ క‌చ్చితంగా తీసుకుని గ్యాస్ బుక్ చేసుకోవాల‌ని తెలిపారు.