ఫ్లాష్ న్యూస్ – అన్లాక్ 2.0 జూలై 1 నుంచి వేటికి అనుమతి ఉంటుంది

ఫ్లాష్ న్యూస్ - అన్లాక్ 2.0 జూలై 1 నుంచి వేటికి అనుమతి ఉంటుంది

0
108

కేంద్రం ఇప్పటికే అన్ లాక్ 1 ప్రకటించింది.. దాదాపు జూన్ లో చాలా వరకూ సడలింపులు ఇచ్చింది కేంద్రం, అయితే వచ్చే నెల ఒకటో తేది నుంచి అన్ లాక్ 2 ఉంటుంది అని తెలుస్తోంది.
అన్లాక్ 1.0 ఈ నెల 30వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే.

అయితే మోదీ సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో లాక్డౌన్ విధించబోమని స్పష్టం చేశారు. అందువల్ల జూలై 1 నుంచి అన్లాక్ 2.0 విధిస్తారని స్పష్టమవుతోంది. మరి కొత్తగా దేనికి అనుమతి ఇస్తారు అనేది చూస్తే.

ఇక కొత్తగా వేటికి అనుమతి ఇవ్వరు అనే తెలుస్తోంది, కేసులు తగ్గితే ఇచ్చే అవకాశం ఉండేది కాని కొత్తగా కేసులు పెరుగుతున్నాయి… సో ఇచ్చే ఆస్కారం అవకాశం లేదు అంటున్నారు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలను తెరిచేందుకు జూలైలో అనుమతిస్తారని అనుకున్నారు, కాని అది ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కు వెళ్లవచ్చు అంటున్నారు. ఇక జిమ్ లు బార్లు తెరిచే అవకాశం ఉండవచ్చు అంటున్నారు.
ఇక థియేటర్ల విషయం పై ఆలోచన చేస్తోంది కేంద్రం..ఇక ప్రత్యేకంగా మళ్లీ కొన్ని రైళ్లు నడిపే అవకాశం ఉండవచ్చు అంటున్నారు…