రజనీ మక్కల్ మండ్రం తన అభిమానులు అందరితో ఇటీవల భేటీ అయ్యారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రజనీకాంత్ ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్న వేళ ఈ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది, మొత్తానికి ఈసారి పార్టీ పెట్టాలి అని డిసైడ్ అయ్యారు రజనీ ..ఆయన ఏ పార్టీకి మద్దతు కాకుండా నేరుగా ఓ పార్టీ ప్రకటన చేయనున్నారు.
చెన్నైలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో కొనసాగిన సమావేశం ముగిసిన తర్వాత తన నివాసం దగ్గర మాట్లాడుతూ రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ చెప్పారు.ఇక 2021 లో కొత్త పార్టీ పెడుతున్నా అని తెలిపారు రజనీకాంత్ నేడు..
ఈ నెల 31న పార్టీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. ఆ రోజునే తాను అన్ని వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. ఇక రజనీ ఫ్యాన్స్ సంబురాల్లో మునిగితేలిపోతున్నారు, ఇక జిల్లాల్లో రజనీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు, ఇక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయం సరికొత్తగా మారనుంది. ఎందుకు అంటే అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు, రజనీకాంత్ ,కమల్ హాసన్ కొత్త పార్టీ పెడుతున్నారు, ఇక కరుణానిధి కుమారుడు అళగిరి కూడా కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు.