హుజురాబాద్ లో సంచలనం రేపుతున్న ఫ్లెక్సీ

0
93

తెలంగాణాలో రాజకీయాల హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధానంగా టిఆర్ఎస్ vs కాంగ్రెస్, టిఆర్ఎస్ vs బీజేపీలా సీన్ మారిపోయింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు గులాబీ పార్టీని వీడారు. సీఎంకు అత్యంత సన్నిహితునిగా ఉన్న ఈటల రాజేందర్ సైతం టిఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉపఎన్నికలో గెలిచారు.

ఇక కాంగ్రెస్ లో ఉన్న కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక తాజాగా ఈటల రాజేందర్ టార్గెట్ గా కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈనెల 5న హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధం. మీరు రండి అని ఈటల రాజేందర్ కు ఆహ్వానం పలుకుతున్న భారీ హోర్డింగ్ హుజురాబాద్ లో దర్శనమిచ్చింది.

హుజురాబాద్ లో జరిగిన అభివృద్దితో పాటు నీ అవినీతి, అక్రమ ఆస్తులపై చర్చకు కౌశిక్ రెడ్డి సిద్దంగా వున్నాడు… నువ్వు కూడా సిద్దమా? అంటూ ప్రశ్నించారు. ఈనెల 5న హుజురాబాద్ అంబెడ్కర్ చౌరస్తాలో ఉదయం 11 గంటలకు ఆహ్వానం పలికారు. ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి లు సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆగస్టు 5వ తేదీన ఏం జరుగుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.