‘అగ్నిపథ్‌’కు దరఖాస్తుల వెల్లువ.. 6 రోజుల్లోనే ఎన్ని దరఖాస్తులు అంటే?

0
97

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకం అల్లర్లకు దారి తీసిన విషయం తెలిసిందే. అగ్నిపథ్ పథకం భారత ప్రభుత్వం మూడు సాయుధ దళాలలో ప్రవేశపెట్టిన నియామక వ్యవస్థ. ఈ విధానంలో నియమితులైన సిబ్బందిని అగ్నివీర్లు అంటారు. 2022 జూన్‌ 14 న భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకాన్ని 2022 సెప్టెంబరు నుండి అమలు చేయాలని తలపెట్టారు.

ఈ పథకం ద్వారా త్రివిధ దళాలలోనికీ, ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు.  సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. నియమితుల ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. ఈ పథకం ద్వారా గతంలో ఉన్నట్లుగా దీర్ఘ కాలం పాటు పని చేసే పద్ధతి పోతుంది. ఉద్యోగం నుండి విరమించాక పింఛను రాదు. ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి.

భారత వాయుసేనలో  నియామకాల కోసం జూన్‌ 24న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుకాగా.. ఆరు రోజుల వ్యవధిలోనే లక్షా 83 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుందని.. ఆసక్తి గల అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.