రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు..అంతేకాకుండా క్రిష్ తో సినిమా ఒకే చేశారు, ఇక హరీష్ శంకర్ తో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నారు, ఫుల్ బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ మరో సినిమాపై ఇప్పుడు ఫోకస్ చేశారట.
తాజాగా పవన్‌కల్యాణ్ మరో రీమేక్‌లో నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రం ఏమిటి అంటే, మలయాళంలో విజయవంతమైన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా రీమేక్ హక్కులను కొందరు నిర్మాతలు చేజిక్కించుకున్నారట, వారు దర్శకులని చూస్ చేసుకుని పవన్ తో సినిమా చేయాలి అని చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక పవన్ కు కూడా ఈ స్టోరీ వినిపించాలి అని చూస్తున్నారు, దీని కోసం ఇద్దరు దర్శకులని ఫైనల్ చేశారట, అన్నీ సెట్ అయి పవన్ ఒప్పుకుంటే ఈ సినిమా కూడా ఒకే అయినట్లే, మరి చూడాలి ఏమవుతుందో