కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది ప్రేమీ విశ్వనాధ్ , ఇక ఆమె తెలియని వారే లేరు, ఇక ఆమెది కేరళ.. ఇక తెలుగులో ఈ సీరియల్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే.. ఇక డాక్టర్ బాబు వంటలక్క ఎప్పుడు కలుస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.మలయాళ చిత్ర సీమ బుల్లితెరలో కంటే ఇక్కడ ప్రేమీ విశ్వనాధ్ మంచి పేరు సంపాదించుకున్నారు.
ఇప్పుడు తెలుగులో పలు యాడ్స్ నటిస్తున్నారు, అంతేకాదు ఆమెకి సినిమా అవకాశాలు వస్తున్నాయట… తన దగ్గర పనిచేసే వారిని ఆమె చాలా బాగా చూసుకుంటారు, వారికి పండుగలకి నగదు బోనస్ లు అలాగే స్పెషల్ గిఫ్టులు కూడా ఆమె ఇస్తూ ఉంటారు.
మూడేళ్లుగా తన దగ్గర పనిచేసిన మేకప్ మ్యాన్ కోసం వంటలక్క పెద్ద మనసు చేసుకుంది. అతడి కోసం ఒక కొత్త మొబైల్ ఫోన్ని కొని ఇచ్చారు ప్రేమి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె పంచుకున్నారు, మొత్తానికి ఆమె చేసిన పనికి అందరూ కూడా మీరు చాలా మంచి పని చేశారు అంటున్నారు, మన దగ్గర పని చేసే వారిని బాగాచూసుకుంటే, మనతో పాటు వారు హ్యాపీగా ఉంటారు అని కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CK23hMcHNPm/?utm_source=ig_embed