రైతుల కోసం బీజేపీ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది, వీటిలో ముఖ్యంగా రైతులు కోట్లాదిమంది లాభపడిన స్కీమ్ పీఎం కిసాన్ స్కీమ్… ఈ స్కీమ్లో చేరిన రైతులు ఏడాదికి రూ.6,000 పొందొచ్చు. ఇది మూడు విడతల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చి చేరుతుంది.
ఇప్పటికే అన్నీ రాష్ట్రాల్లో రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు, నేరుగా వారి అకౌంట్లో రెండు వేల చొప్పున ప్రతీసారి పడుతున్నాయి..ఇప్పటికే ఆరు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఒక్కో రైతు బ్యాంక్ అకౌంట్లోని కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.12,000 వచ్చాయి.
అయితే కొందరు రైతులు తమకు ఈ నగదు జమ అవ్వడం లేదు అని ఫిర్యాదులు చేస్తున్నారు, మీరు అప్లై చేసుకున్న సమయంలో మీ ఆధార్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సీడింగ్ కలిసిందా లేదా అనేది చూడాలి, ఆధార్ లింక్ చేయకపోతే మీకు నగదు జమ అవ్వదు.. కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి..
ఇక మీరు కచ్చితంగా బ్యాంకుకు వెళ్లి ఈ ఆధార్ నెంబర్ ఇచ్చి అనుసంధానం చేయాలి. అంతేకాదు ఆధార్ లో పేరు బ్యాంకు అకౌంట్ పేరు కూడా సరిపోవాలి . ఇలా చేసి అప్లై చేయండి తప్పకుండా మీకు నగదు వస్తుంది, లేకపోతే స్ధానిక అధికారిని సంప్రదించండి.