రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకి అనేక కొత్త రూల్స్ తీసుకువస్తోంది కేంద్రం, తాజాగా మోటార్ వెహికిల్ చట్టంలో ఈమేరకు కొన్ని మార్పులు చేసింది. మరి కొత్త బైకులు తయారు చేసే సంస్ధలు వీటిని ఏర్పాటు చేయాలి మరి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
బైకులకు హ్యాండ్ హోల్డ్స్ ఉండాలని కేంద్రం సూచించింది. దీంతో వెనుక కూర్చున్నా మహిళల భద్రత కోసం చేతి పట్టు ఉండడానికి, బైక్ నడిపేవారు బ్రేక్ వేస్తే వారు కింద పడకుండా ఇవి కాపాడతాయి, ప్రమాదాలు జరుగకుండా ఉంటాయి, ఇక కంపెనీలు వీటిని తయారు చేసే సమయంలో ఏర్పాటు చేయాల్సిందే.
వెనకాల కూర్చునే వాహనదారుల కోసం కాళ్ళు పెట్టుకునే విధంగా పెడల్స్, వెనుక టైర్ ఎడమవైపు భాగంలో సెక్యూరిటీ కవరింగ్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం తెలిపింది. ఫుట్రెస్ట్లను కచ్చితంగా కంపెనీలు అందించాలి, చక్రంపై సారి గార్డ్ పరికరాలను అందించాలి. వీటి వల్ల శారీలు డ్రెస్సులు వెనుక వీల్ లో పడకుండా ఉంటాయి, ఒకవేళ వీటిని కంపెనీలు ఏర్పాటు చేయకపోతే ఆర్టీవో ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయరు.