ఆ మంత్రిపై మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ సంచలన ఆరోపణలు

Former Chief Minister Fadnavis' sensational allegations against the minister

0
93

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో రాజకీయ రగడ ఇంకా కొనసాగుతోంది. ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను తన ట్వీట్లతో ముప్పుతిప్పలు పెడుతున్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌. నవాబ్‌మాలిక్‌కు దావూద్‌ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

ముంబై పేలుళ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్‌మాలిక్‌ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించారు ఫడ్నవీస్‌. నవాబ్‌మాలిక్‌ దగ్గర ఉన్న ఆస్తుల్లో నాలుగు ఆస్తులు అండర్‌వాల్డ్‌తో లింక్‌ ఉన్నాయని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్‌పపవార్‌కు కూడా డాక్యుమెంట్లు అందిస్తానని తెలిపారు.