TTD తీరు పై మాజీ సిఎం సీరియస్ (వీడియో)

0
77

రెండు రోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేయడంతో మంగళవారం భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో టోకెన్ల కోసం భక్తులు చాలా అవస్థలు పడుతున్న నేపథ్యంలో పలువురికి గాయాలు కూడా జరిగాయి. అయితే ఈ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే తితిదే ఏం చేస్తోందని ప్రశ్నించారు. భక్తులకు తాగు నీరు, క్యూలైన్లలో నీడ ఉండేలా వసతులు కల్పించలేరా అని  నిలదీశారు.

తితిదే చేతగాని నిర్ణయాలు శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనాలు, వసతికి సంబంధించి చాలా రోజులుగా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని మండిపడ్డారు. తిరుమలలాంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆదాయ వనరు కోణంలో చూడటం మానవత్వం కాదని మండిపడ్డారు . కొండపైకి వెళ్లడానికి కూడా ఆంక్షలు విధించడం వల్ల భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆక్షేపించారు. భక్తులకు తితిదే క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://www.facebook.com/alltimereport/videos/1627614150973199