Breaking- మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అరెస్టు

Former MLA Bodige Shobha arrested

0
102

తెలంగాణ: 317 ఉద్యోగ ఉపాధ్యాయ జీవోను సవరించాలని కోరుతూ ఈ నెల 3న కరీంనగర్​లో ఎంపీ కార్యాలయం ముందు బండి సంజయ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ వివిధ సెక్షన్లపై కేసులు నమోదు చేయగా..బండి సంజయ్​తో పాటు పది మందిపై కేసులు బనాయించారు. ఇందులో భాగంగా బొడిగె శోభ కూడా ఉంది. ఇప్పటికే బండి సంజయ్‌ జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉండగా… ఇప్పుడు బొడిగె శోభను అరెస్టు చేశారు.