పార్టీ మార్పుపై మాజీ ఎంపీ క్లారిటీ..

0
103

ఇటీవలే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నానంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఎంపీ స్పందించి అందరికి స్పష్టత ఇచ్చాడు.   టీఆర్ఎస్ ప్రభుత్వ నేతలపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం తన ఆలోచన ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించకుండా ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ సంస్థలతో విచారణ జరిపిస్తే టీఆర్ఎస్ నేతల అసలు విషయాలు వెలువడుతాయని ఈ మేరకు తెలియజేసారు. కానీ ఈ విషయంపై కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తుందో తెలియడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.