తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్..ఆ సమావేశంపై పోలీసుల నజర్

0
111

తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ పురుడుపోసుకోనున్నాయా? తాజాగా రాష్ట్రంలో మాజీ నక్సల్స్ సమావేశం ఇప్పుడు ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. జనశక్తి సెక్రటరీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల అటవీ ప్రాంతంలో 80 మందితో సమావేశం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వీరంతా సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటకు చెందిన మాజీ నక్సల్స్ అని సమాచారం. అయితే గత కొంతకాలంగా  జనశక్తికి దూరంగా వ్యవస్థాపకులు కూర రాజన్న , కూర అమర్ వుంటున్నారు. గత కొంతకాలంగా గా సైలెంట్ గా ఉన్న జనశక్తి నక్సల్స్ ఉన్నట్టుండి సమావేశం నిర్వహించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

జనశక్తి మీటింగ్ పై ఆరా తీసి మాజీ నక్సల్స్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఎవరెవరు ఈ సమావేశానికి హాజరయ్యారు.. ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. మళ్లీ ఎందుకు జనశక్తి మూమెంట్ వైపు వెళ్తున్నారు.