కాంగ్రెస్ ఎంపీకి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

0
80
Telangana Congress Party

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ను ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. థరూర్‌ రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ‘షువలియె డి లా లిజియన్‌ హానర్‌’ అవార్డును ప్రకటించినట్లు భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనియన్‌ తెలిపారు.

దీనిపై ఆయన స్పందిస్తూ..”ఫ్రాన్స్‌తో సంబంధాలను సమర్థించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాధించే వ్యక్తిగా.. ఈ అవార్డు పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నన్ను దీనికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు” అని ఆయన పేర్కొన్నారు. అవార్డు వరించిన నేపథ్యంలో థరూర్‌కు లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి సహా పలువురు హస్తం పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.