దుబ్బాకలో ఫ్రీ అంబులెన్స్ సర్వీసులు..అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యే

0
96

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మానవత్వం చాటుకున్నారు. తన జ‌న్మ‌దిన కానుక‌గా దుబ్బాక నియోజకవర్గానికి ఆధునిక వసతులతో కూడిన ఫ్రీ అంబులెన్స్ అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

సుమారు 35 లక్షలతో ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ తో కూడిన ఉచిత అంబులెన్స్ సేవలు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వినియోగించుకోవాలి. ఈ అంబులెన్సులో అన్ని సౌక‌ర్యాలున్నాయి. పూర్తి అత్య‌వ‌స‌ర ప‌రికరాలు ఇందులో ఉన్నాయి. సుమారు రూ.35 లక్షల విలువతో ఆధునిక వసతులు గ‌లిగిన ఈ అంబులెన్స్‌ను సొంత ఖ‌ర్చుతో కొనుగోలు చేశారు ఎమ్మెల్యే. ఎవ‌రికి ఏ ఇబ్బంది వ‌చ్చి హాస్పిట‌ల్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉన్నా ఈ ఫ్రీ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

రేపటి నుండి పూర్తి స్థాయిలో 24 గంటలు దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఈ అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. ఎవరికైన అత్యవసర పరిస్థితి ఉంటే వెంట‌నే ఎమ్మెల్యే నంబర్ కి లేదా క్యాంపు కార్యాలయానికి సంప్రదిస్తే ఈ అంబులెన్స్ సేవలు అందుతాయని తెలిపారు.