ఏపీలో సీఎం జగన్ సర్కారు మరో కొత్త పథకం తీసుకువచ్చింది, నిజంగా రైతుల ప్రభుత్వం అనిపించుకుంటోంది, తాజాగా రైతులకి గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్, నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం వైఎస్సాఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టారు, మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం.
అర్హతలు.
రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి.రైతులకు అంత భూమి లేకపోతే పక్కనే ఉన్నవారితో కలిసి బోరు వేయించుకునే అవకాశం ఇచ్చారు.
దరఖాస్తు విధానం.
1. రైతులు దీని కోసం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చు
2. గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం ద్వారా ధరఖాస్తు ఇవ్వవచ్చు
3. లబ్ధిదారుడు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు కాపీ కచ్చితంగా జిరాక్స్ ఇవ్వాలి
4..దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు
5. తర్వాత డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం జియోలజిస్ట్కు పంపుతారు.
5. అక్కడ ఒకే అనగానే డ్వామా అసిస్టెంట్ పిడి సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు.
6.రైతు పొలంలో హైడ్రో–జియోలాజికల్, జియోఫిజికల్ సర్వే నిర్వహిస్తారు.
7. తర్వాత బోర్ వేసే కాంట్రాక్టర్ అక్కడకు చేరుకుంటాడు
8.కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్ లో బోరుబావులను తవ్వుతారు
7.అక్కడ సక్సస్ శాతం బట్టీ బిల్లుల చెల్లింపు కాంట్రాక్టర్లకు ఉంటుంది
8. మొదటి బోరు విఫలమైతే రెండోసారి బోరు వేస్తారు ఆందోళన వద్దు
9.అంతకు ముందు అక్కడ బోరు బావి నిర్మాణం ఉండకూడదు
10. ఇక రైతు పొలంలో బోరు వేసిన తర్వాత వెంటనే రైతుకి ఎస్ ఎం ఎస్ వస్తుంది.
11.రైతులకి బోరు వేయించడంతోపాటు ఉచితంగా మోటార్ను సైతం బిగిస్తామని చెప్పారు సీఎం జగన్.