ఫ్రెండ్స్ అందరూ కలిసి లాటరీ టికెట్ కొన్నారు – ఏకంగా రూ.40 కోట్లు తగిలింది

Friends all bought a lottery ticket together- 40 crore got at a time

0
122

కొందరు ఎన్నో ఆర్దిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో వారికి జాక్ పాట్ తగులుతూ ఉంటుంది. అసలు ఊహించనంత లాటరీ తగులుతూ ఉంటుంది. వారి జీవితంలో ఇలాంటి రోజు వస్తుంది అనుకోరు. కాని ఇలాంటి రోజు రావడంతో ఆనందంలో ఉంటారు. ఇక తాజాగా ఇలాంటి జాక్ పాట్ తగిలింది ఓ వ్యక్తికి. అబుదాబిలో 2008 నుంచి టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న కేరళ వ్యక్తి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు.

ఈ మధ్య అతను కొన్న లాటరీ టికెట్కు రూ. 40 కోట్ల జాక్పాట్ తగిలింది. 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న తన సహచరులైన 9 మందితో కలిసి తలా 100 దిర్హమ్లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఇక ఆ లాటరీ టికెట్ కు తాజాగా లాటరీ తగిలింది.

ఆ టికెట్కు 3 కోట్ల దిర్హమ్లు మన కరెన్సీలో 40 కోట్లు తగిలాయి. జాక్పాట్ తగిలిన విషయం తెలిసి ఎంతో ఆనందించాడు. ఇక తన ఫ్రెండ్ అందరం కలిసి ఇది కొన్నాం. అందరూ కలిసి ఈ డబ్బులు షేర్ చేసుకుంటాం అని చెప్పాడు. అతని కుటుంబం చాలా ఆనందంలో ఉంది. దాదాపు ఒక్కొక్కరికి నాలుగు నుచి ఐదు కోట్లు రావచ్చట.