తెలంగాణ, ఏపి బార్డర్లలో వాహనాల రాక పోకలపై ఫుల్ క్లారిటీ

Full clarity on the arrival and departure of vehicles in Telangana and AP borders

0
90

 తెలంగాణ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ శనివారం నాడు  నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆంక్షలు కూడా ఎత్తేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో అన్ని సరిహద్దుల్లో వాహనాలు యధావిధిగా నడువనున్నాయి.

తెలంగాణ  ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడస్తాయని ప్రకటించినప్పటికీ, ఒక్క అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై స్పష్టత రాలేదు. దీంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే జనాలు, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు సందిగ్ధంలో పడ్డారు. అయితే శనివారం అర్ధరాత్రి దాటాక ఇక తెలంగాణ బార్డర్‌లో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేయడంతో రాకపోకలు సాగుతున్నాయి.

మరోవైపు ఏపీలో  కర్ఫ్యూ నేపథ్యంలో ఏపి చెక్‌పోస్ట్ వద్ద  ఆంక్షలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ సమయంలో ఈ -పాస్ ఉంటేనే ఆంధ్రాలోకి పోలీసులు అనుమతి ఇవ్వనున్నారు.