మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, భారీగా కొన్ని దేశాల్లో మరణాలు నమోదు అవుతున్నాయి, ఈ విపత్కర పరిస్దితిలో మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేయాలి అని భావిస్తున్నాయి కొన్ని దేశాలు.. మన దేశంలో కాస్త కేసులు తగ్గినా డేంజర్ పరిస్దితిలో ఉన్నామని నిపుణులు తెలియచేస్తున్నారు, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ఇక టీకా జనవరి నుంచి అందుబాటులోకి రానుంది.
అయితే తాజాగా నేటి నుంచి జనవరి 10 వరకూ లాక్ డౌన్ విధిస్తున్నారు మెక్సికోలో…కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో మెక్సికోలో మరోసారి లాక్డౌన్ విధించనున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మెక్సికో చుట్టూ అనవసరమైన కార్యాకలాపాలు నిషేధించారు, ఇక నేటి నుంచి ఇవి అమలులోకి వస్తాయి జనవరి 10 వరకూ ఇది అమలులో ఉంటుంది.
శివారు ప్రాంతాల్లో తిరగవచ్చు కాని నగరాల్లో మాత్రం తిరగడానికి లేదు, దుకాణాలు మూసేశారు, హాల్లు క్లోజ్ పార్కులు రెస్టారెంట్లు క్లోజ్ … ఇప్పటికే ఇక్కడ 75 శాతం ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి, దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు.