టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు అలాగే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు జన్మధిన శుభాకాంక్షలు తెలిపారు ఆ పార్టీ నేత లోకేశ్ ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు..
ఆత్మీయులు, సోదరసమానులైన గల్లా జయదేవ్ కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పార్లమెంటులో తెలుగువారి గొంతుకను పదికాలాలపాటు ఇలాగే గంభీరంగా వినిపించే అవకాశాన్ని భగవంతుడు అందించాలని కోరుకుంటున్నాను
అలాగే తెలుగుదేశం మహిళా నేత, మాజీ శాసనసభ్యులు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.