గాంధీ ఆస్పత్రిలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చికిత్స మొదలైనప్పటి నుంచి ఆస్పత్రిలో పొరపాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే..సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏకంగా కరోనా తో చనిపోయిన మృతదేహాల మార్పిడి సైతం జరిగింది.ఒకరి మృతదేహాన్ని మరొక కుటుంబానికి అప్పగించడంతో వారు స్మశానానికి తీసుకెళ్లి గుర్తించి మళ్లీ ఆస్పత్రికి వచ్చారు.
ఈ క్రమంలో వైద్య సిబ్బందిపై దాడులు కూడా జరిగాయి.తాజాగా గాంధీలో నిర్లక్ష్యానికి అద్దం పట్టే మరో ఘటన జరిగింది. హాస్పిటల్ లో కరోనా చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే అతన్ని ఎవరూ పట్టించుకోపోవడం గమన్హారం.వ్యక్తి మరణించి 8 గంటలవుతున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో మృతదేహం నుంచి దుర్వాసన వచ్చింది. కరోనా వార్డు మొత్తం చెడు వాసన వస్తుండడంతో మిగతా రోగులు సైతం ఇబ్బంది పడ్డారు.
వాసన విపరీతంగా రావడంతో ఐసోలేషన్ వార్డులు ఖాళీ చేసి కరోనా పేషెంట్లు అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు.రోగులు వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోలేదని సమాచారం. అయితే, ఈ ఘటనపై గాంధీ ఆసుపత్రి సూపర్డెంట్ స్పందించారు.మార్చురీకి మృతదేహాన్ని తరలించకుండా 8 గంటల పాటు ఉంచాలనేది అవాస్తవమని చెప్పారు.మృతదేహానికి ఈసీజీ తీసేందుకు కొంచెం సమయం పట్టిందని చెప్పారు. ఈ క్రమంలో దాన్ని తరలించడంలో ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చారు.