గంటాకు టైమ్ వచ్చింది… వైసీపీ వెల్ కమ్ సాంగ్

గంటాకు టైమ్ వచ్చింది... వైసీపీ వెల్ కమ్ సాంగ్

0
90

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు వెల్ కమ్ సాంగ్ పాడేందుకు సిద్దమైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… విశాఖ అర్భన్ లో టీడీపీకి బలం ఉంది… 2019 ఎన్నికల్లో విశాఖ తూర్పు పడమర, ఉత్తరం, దక్షిణం, స్థానాలను జగన్ సునామిని తట్టుకుని టీడీపీ గెలిచింది…

ఇప్పుడు ఇక్కడ జీవీ ఎంసీ ఎన్నికలు జరుగనున్నారు… 13 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగనుండటంతో గెలుపుకోసం ఇరు పార్టీ నేతల ప్రయత్నాలు చేస్తున్నారు… ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ గెలుపు తప్ప వేరే ఆప్షన్ లేదన్నట్లు గా శ్రమిస్తోంది…అందులో భాగంగానే గంటాకు వెల్ కమ్ సాంగ్ ప్లే చేయాలని చేస్తోందని వార్తలు వస్తున్నాయి…

కాగా ఎప్పటినుంచో గంటా వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కాని చేరలేదు. ఇప్పడు వైసీపీనే వెల్ కమ్ సాంగ్ ప్లే చేస్తున్న నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరుతారా లేదా అని విశాఖ వాసులు చర్చించుకుంటున్నారు…