గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా పేటీఎం బెస్ట్ ఆఫర్

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా పేటీఎం బెస్ట్ ఆఫర్

0
116

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి గ్యాస్ కనెక్షన్లు ఉంటున్నాయి, గ్యాస్ వినియోగదారులు తమకు ఉన్న గ్యాస్ డీలర్ దగ్గర ఈ సిలిండర్లు తెచ్చుకుంటున్నారు.. ఇలా ఆన్ లైన్ లో సులువుగా బుక్ చేసుకుంటున్నారు…అయితే పలు ఈ వాలెట్స్ కూడా గ్యాస్ బుక్ చేసుకునే సమయంలో బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాయి, ఇక పేటీఎం తాజాగా ఓ బెస్ట్ ఆఫర్ ఇచ్చింది.

 

ఇ-వాలెట్ సంస్థ పేటీఎం.. గ్యాస్ సిలిండర్ బుకింగ్పై తగ్గింపు ఆఫర్ అందిస్తోంది.రూ.800 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ ఇస్తోంది.. అయితే ఇది అందరికి కాదు మొదటిసారి ఎవరైతే ఇలా బుక్ చేసుకుంటున్నారో వారికి మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది… ఈ ఆఫర్ కేవలం ఏప్రిల్ నెలాఖరు వరకూ మాత్రమే ఉంటుంది.

 

తొలిసారి పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికే వర్తిస్తుంది. సో మీరు ఇప్పటి వరకూ గ్యాస్ బుక్ చేసుకోపోతే వెంటనే చేసుకోండి క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.. ముందుగా మీరు రీచార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్లోకి వెళ్లాలి. అక్కడ మీ గ్యాస్ కంపెనీ సెలక్ట్ చేసుకోవాలి..మీరు ప్రొమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే రూపాయి నుంచి 800 వరకూ ఎంతైనా క్యాష్ బ్యాక్ రావచ్చు.