ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా… అయితే మీకు గుడ్ న్యూస్ , మన దేశీయ దిగ్గజ ఈవాలెట్ సంస్థ పేటీఎం కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. తన ప్లాట్ఫామ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. సో ఇంకెందుకు ఆలస్యం ఆ ఆఫర్ ఏమిటో చూద్దాం.
మీరు పేటీఎం లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ రానుంది, ఇది భారీ ఆఫర్, ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.809గా ఉంది. సో క్యాష్ బ్యాక్ 10 రూపాయల నుంచి 800 వరకూ వస్తుంది అని తెలిపారు, అంటే మీరు పది రూపాయల నుంచి 800 వరకూ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది.
ఇక్కడ ఓ విషయం గుర్తు ఉంచుకోవాలి…ఈ క్యాష్ బ్యాక్ పొందాలని భావించే వారు పేటీఎం ద్వారా తొలి సారి గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తూ ఉండాలి. వీరికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక మీరు పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా చేయకపోతే ఇలా చేయండి మీకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత స్క్రాచ్ కార్డు వస్తుంది. ఇందులో మీకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది ఉంటుంది. 48 గంట్లలో మీకు వ్యాలెట్ లో చేరతాయి ఈ నగదు.