గ్యాస్ ధ‌ర‌లు పెరిగాయి ఎక్క‌డ ఎంతో చూడండి

గ్యాస్ ధ‌ర‌లు పెరిగాయి ఎక్క‌డ ఎంతో చూడండి

0
83

ప్ర‌తీ నెలా ఒక‌టో తేది వ‌స్తుంది అంటే జీతాలు వ‌చ్చే స‌మ‌యం అని ఆనందం ఉంటుంది.. ఏవి రేట్లు పెరుగుతాయా అని టెన్ష‌న్ ఉంటుంది, అయితే తాజాగా కొన్ని నెల‌లుగా గ్యాస్ ధ‌ర‌లు కూడా తొలి వారంలోనే పెరుగుద‌ల త‌గ్గుద‌ల డిసైడ్ చేసి కంపెనీలు చెబుతున్నాయి.

మొద‌టి రోజు చాలా వ‌ర‌కూ గ్యాస్ ధ‌ర‌ల పెంపు త‌గ్గుద‌ల గురించి క్లారిటీ ఇస్తున్నాయి, తాజాగా ఈ వైర‌స్ తో లాక్ డౌన్ స‌మ‌యంలో గ్యాస్ ధ‌ర‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి… కాని తాజాగా గ్యాస్ ధ‌ర‌లు పెరిగాయి..
మెట్రో నగరాల్లోసిలిండర్‌కు 4.50 రూపాయలకు వరకు పెంచారు.

సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ పై ఢిల్లీలో ఒక రూపాయి, ముంబైలో 3 రూపాయల 50 పైసలు , కోల్‌కతాలో4.50 రూపాయలు, చెన్నైలో 4 రూపాయలు, హైదరాబాద్ లో 4.50 రూపాయలు చొప్పున
పెరిగింది. ఈనెల‌లో స్వ‌ల్పంగానే సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయి.