గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ చెప్పాల్సిందే ? ఇలా ఫాలో అవ్వండి

గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ చెప్పాల్సిందే ? ఇలా ఫాలో అవ్వండి

0
96

వంట గ్యాస్ ఈ మధ్య కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, దీని వల్ల అసలైన వినియోగదారులకి ఇది చేరడం లేదు, అందుకే ఈ మోసాలు జరగకుండా ఉండేందుకు ఆయిల్ కంపెనీలు సిద్దం అయ్యాయి, ఇప్పటికే ఓటీపీ చెబితేనే గ్యాస్ ఇస్తాము అని కొన్ని చోట్ల మెట్రో సిటీస్ లో చెబుతున్నారు.

అయితే ఇక గ్యాస్ బుకింగ్ చేసే సమయంలో వినియోగదారుడి మొబైల్ ఫోన్కు వచ్చే ఓటీపీని చెబితేనే డెలివరీ చేయనున్నారు. ఇక మీ ఇంటికి డెలివరీ బాయ్ వచ్చిన సమయంలో మీరు ఓటీపీ చెప్పాలి అది కచ్చితంగా మెసేజ్ రూపంలో వస్తే దానిని పుస్తకం పై రాయండి.

ఒకవేళ మెసేజ్ పోయినా ఇబ్బంది ఉండదు, ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించే వెసులుబాటును కూడా ఆయిల్ కంపెనీలు కల్పిస్తున్నాయి. ఇక పలు యాప్స్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, పలు రాయితీలు వస్తున్నాయి, ఇక డిజిటల్ పేమెంట్లకు కూడా పలు కంపెనీలు సిద్దం అయ్యాయి. మీరు మాత్రం ఓటీపీ లేకుండా గ్యాస్ డెలివరీ తీసుకోలేరు.