మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్ ఇప్పుడు మార్కెట్లోకి కొత్త గ్యాస్ సిలిండర్లు వచ్చాయి..
ఇవి కంపోసైట్ ఎల్పీజి సిలిండర్లు. కేవలం ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు మాత్రమే ఈ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి.
సో ఇవి లుక్ చూస్తే చాలా బాగున్నాయి.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.. చూసిన వారు అందరూ బాగున్నాయి అంటున్నారు.
అయితే తాజాగా ఇండియన్ ఆయిల్ కొత్త కంపోసైట్ ఎల్పీజీ సిలిండర్లు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్లో మాత్రమే లభిస్తున్నాయి. ఇక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మీకు ఇవి అందుబాటులో ఉన్నాయి… అయితే ఇవి ఎన్ని కేజీల్లో అందుబాటులో వస్తున్నాయి అనేది చూస్తే.
ఈ కొత్త కంపోసైట్ ఎల్పీజీ సిలిండర్లు 5 కేజీలు అలాగే 10 కేజీల సైజ్ లో దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడు మనం వాడుతున్న సిలిండర్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ బరువు ఉంటాయి.. ఇక ఇందులో ఎంత గ్యాస్ ఉందో ఈజీగా తెలుస్తుంది, సో మీరు ఈ సిలిండర్లు చూడండి.
Add some verve and style to your kitchen. Introducing the all-new, composite #LPG cylinders from Indane. Currently available in Delhi and Hyderabad only. Contact your nearest Indane distributor for more details. #Indane pic.twitter.com/AqS51YiZ9K
— Indian Oil Corp Ltd (@IndianOilcl) April 19, 2021