టైమ్ క్యాప్సూల్ ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది..టైమ్ క్యాప్సూల్‌ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. భూకంపాలు, తుఫానుల్లాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా ఇది తట్టుకుంటుంది. వేల సంవత్సరాలు గడిచినా ఈ టైమ్ క్యాప్సూల్ చెక్కుచెదరదు.
ఇది భూమిలోపల ఏర్పాటు చేస్తారు, దేనిని అయినా తట్టుకుంటుంది, దాని చరిత్ర ఆ విశిష్టత ఇందులో భద్రంగా ఉంచుతారు, అయితే గతంలో ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది చూస్తే
1972 ఢిల్లీలోని ఎర్రకోటలో టైమ్ క్యాప్సూల్ పాతిపెట్టారు.
2010 లో ఐఐటీ కాన్పూర్‌లో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అక్కడ వివరాలు అన్నీ అందులో ఉంచారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 2010 లో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేశారు. అందులో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన ఆడియో, వీడియో సమాచారం ఉంది.
ముంబైలోని అలెగ్జాండర్ మగల్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో 2014 లో టైమ్ క్యాప్సూల్ ఏర్పాటు చేశారు. అందులో స్కూల్ ఫోటోలు, యూనిఫామ్స్, ఎడ్యుకేషన్ సంబంధించి పత్రాలు పుస్తకాలు ఉన్నాయి.