ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండురోజుల క్రితం వరకు డీజీపీగా కొనసాగిన గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసింది. సవాంగ్ స్థానంలో కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే పలు కారణాలతో సవాంగ్‌పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే తాజాగా ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతామ్ సవాంగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్ పదవీకాలం ఆరునెలల క్రితం పూర్తయింది. అప్పటి నుంచి పదవి ఖాళీగా ఉంది. దీనితో ఈ పదవిని సవాంగ్ కు కట్టబెట్టింది సర్కార్.