Flash- కౌశిక్ రెడ్డి అడ్డగింతపై గెల్లు శ్రీనివాస్ రియాక్షన్

Gell Srinivas reaction on Kaushik Reddy interception

0
100

ఓటు వినియోగించుకున్న తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డిని పలు గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై ఆయనను మీడియా ప్రశ్నిస్తే..ఏ మాత్రం స్పందించకుండా గెల్లు అక్కడినుంచి వెళ్లిపోయారు.

హుజూరాబాద్ లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కును హిమ్మత్ నగర్ లో వినియోగించుకున్నారు. మార్పుకు హుజూరాబాద్ నాంది కావాలని ఆయన అన్నారు. ఆయన తన స్వగ్రామమైన హిమ్మత్ నగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా బయటకొచ్చి ఓటేయాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే ఆయుధమని ఆయన అన్నారు. పోలింగ్ శాతం పెరగాలని ఆయన ప్రజలను కోరారు.

హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలిస్తున్నారు. బుద్ధభవన్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. కరోనా నిబంధనల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు.