జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల- ఉచిత వైఫై

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల- ఉచిత వైఫై

0
98

జీహెచ్ఎంసీ ఎన్నికల జోరు మొద‌లైంది, మొత్తానికి మ‌రో 20 రోజుల్లో ఎన్నిక‌లు పూర్తి అవ‌నున్నాయి, ఇక అభ్య‌ర్దులు ఎవ‌రు హామీలు ఏమిటి ఇలా అంతా చ‌ర్చ జ‌రుగుతోంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 స్థానాల్లో గెలవబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. స‌ర్వేలు అన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయి అని తెలిపారు ఆయ‌న‌.

ఇక ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీని పెద్ద ప‌ట్టించుకోవ‌క్క‌ర్లేదు అన్నారు ఆయ‌న‌, తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.. నేడు జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు చూద్దాం.

హైద‌రాబాద్ న‌గ‌రంలో కొత్త‌గా నాలుగు ఆడిటోరియాల నిర్మాణం చేప‌డ‌తామ‌న్నారు
ఇక న‌గ‌రంలో ఉన్న అన్నీ గ్రంధాల‌యాలు ఆధునిక‌ర‌ణ చేస్తామ‌న్నారు
రూ. 130 కోట్లతో 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు ఏర్పాటు
నగరమంతా ఉచిత వైఫై సదుపాయం ఏర్పాటు
రూ. 1900 కోట్లతో మరో 280 కి.మీ. మేర మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేస్తామ‌ని
మూసీ సుందరీకరణ.. హుస్సేన్ సాగర్ శుద్ధికి ప్రణాళిక. చేస్తామ‌ని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది.