GHMC ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది – రిజర్వేషన్ల లిస్ట్ ఇదే

GHMC ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది - రిజర్వేషన్ల లిస్ట్ ఇదే

0
87

మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి ఎన్నికల నగారా మోగింది, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి నోటిఫికేషన్ విడుదల చేశారు, ఈఏడాది లోనే ఈ ఎన్నికలు పూర్తి అవుతాయి, వచ్చే నెలలో ఈ సమయానికి మేయర్ పీఠం ఎవరిదో తేలిపోతుంది.

మరి షెడ్యూల్ నోటిఫికేషన్ ఓసారి చూద్దాం

రేపటి నుంచి ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది గ్రేటర్ పరిధిలో
ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది
ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు
2020 డిసెంబర్ 1న పోలింగ్ ఉంటుంది
డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుంది
2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు, దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ ఉంటుంది.
ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే ఉంటాయని…బ్యాలెట్ పేపర్లు తెలుపు రంగులోనే ఉంటాయని చెప్పారు.

రిజర్వేషన్ల వివరాలు.. చూద్దాం
జిహెచ్ఎంసి మేయర్ పదవి : మహిళ (జనరల్)
ఎస్టి 2,
ఎస్సి 10,
బిసి 50,
జనరల్ మహిళ 44,
జనరల్ 44