జిహెచ్ఎంసి ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టో మాములుగా లేదు

జిహెచ్ఎంసి ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టో మాములుగా లేదు

0
99
Telangana Congress Party

జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి, మరీ ముఖ్యంగా మేనిఫెస్టో ఒకరిని మించి మరోకరు ఇస్తున్నారు అనే చెప్పాలి,ఇప్పటికే టీఆర్ఎస్ తన హామీలు ఇచ్చింది, ఇక బీజేపీ కాంగ్రెస్ కూడా పోటా పోటీగా హామీలు ఇస్తున్నారు, తాజాగా హస్తం పార్టీ కాంగ్రెస్ తన మేనిఫెస్టో ప్రకటించింది.

వరద బాధిత కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తామంది. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5లక్షలిస్తామన్నారు. ఇక ఎవరికి ఇళ్లు దెబ్బతిన్నాయో వారికి
2.5లక్షలు ఇస్తామన్నారు.

ఇక గ్రేటర్ లో గెలిపిస్తే మహిళలు, వృద్దులు, వికలాంగులకి మెట్రో,ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. . కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పిస్తామన్నారు. బస్తీ దవాఖానాలను 450 కి పెంచుతామన్నారు. పాతబస్తీ, కేబుల్ ఆపరేటర్లకు పోల్ ఫీజు రద్దు చేస్తామన్నారు. ఇక గ్రేటర్ లో సొంత స్ధలంలో మీరు ఇళ్లు కట్టుకుంటే మీకు 8 లక్షలు ఇస్తామన్నారు, ఇక మీకు ఇళ్లు ఉండి మరో గది కట్టుకుంటే 4 లక్షలు ఇస్తాము అన్నారు గ్రేటర్ లో 80 గజాల లోపు ఇళ్లకు పూర్తిగా ఆస్తి పన్ను మాఫీ చేస్తామన్నారు.